తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా తనదైన శైలిలో జయశంకర్ కి నివాళులర్పించారు.

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడంటూ జయశంకర్‌ను కేటీఆర్ కొనియాడారు. ‘‘జయశంకర్ సార్ యాదిలో.. పుట్టుక మీది.. చావు మీది.. బతుకు తెలంగాణది’’ అని ట్వీట్ చేశారు.

 

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పించిన మహోపాధ్యాయులని మాజీ ఎంపీ కవిత ప్రశంసించారు. ఆజన్మాంతం తెలంగాణనే స్వప్నించి, శ్రమించిన కర్మయోగి అని గుర్తు చేసుకున్నారు. ‘‘మహాత్మా మీరు చూపిన తోవలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు పునరంకితమవుతాం’’ అని ట్వీట్ చేశారు.