లోక్ సభ ఎన్నికల బాధ్యత కేటీఆర్ కే ... ఈ నెలంతా కీలక సమావేశాలు

లోక్ సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ సంసిద్దం అవుతోంది. ఈ నెలంతా కేటీఆర్ లోక్ సభ నియోజకవర్గాలవారిగా ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. 

KTR and BRS Party Prepare for the parliament Elections 2024 AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలకు ముందస్తుగానే సిద్దమవుతోంది భారత రాష్ట్ర సమితి పార్టీ. అధికారాన్ని కోల్పోవడంతో ఢీలా పడ్డ లీడర్లు, క్యాడర్ ను లోక్ సభ ఎన్నికలకు సంసిద్దం చేసే బాధ్యతకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాల నిర్వహణకు కేటీఆర్ సిద్దమయ్యారు. కొత్త సంవత్సరం ఆరంభంలోనే లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  కసరత్తు ప్రారంభిస్తున్నారు. 

జనవరి 3 నుండి అంటే వచ్చే బుధవారం నుండి ఒక్కో లోక్  సభకు చెందిన ముఖ్య నాయకులతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం కానున్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఏ తేదీల్లో ఏ నియోజకవర్గాల నాయకులతో కేటీఆర్ సమావేశం కానున్నారో బిఆర్ఎస్ ప్రకటించింది. 

తేదీలు, లోక్ సభ నియోజకవర్గాలవారిగా సమావేశాల వివరాలు : 

జనవరి 3  ఆదిలాబాద్ 

జనవరి 4 కరీంనగర్ 

జనవరి 5 చేవేళ్ళ 

జనవరి 6 పెద్దపల్లి 

జనవరి 7 నిజామాబాద్ 

జనవరి 8 జహిరాబాద్ 

జనవరి 9 ఖమ్మం 

జనవరి 10 వరంగల్  

జనవవరి 16 నల్గొండ 

జనవరి 17 నాగర్ కర్నూల్ 

జనవరి 18 మహబూబ్ నగర్ 

జనవరి 19 మెదక్ 

జనవరి 20 మల్కాజ్ గిరి 

జనవరి 21 సికింద్రాబాద్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios