Asianet News TeluguAsianet News Telugu

ఈసీ కంటే ముందే బీజేపీ ఎన్నికల తేదీని ప్రకటిస్తుంది.. ఆ పార్టీ పేరు ఇలా మార్చుకుంటే సరి: కేటీఆర్ సెటైర్లు

మునుగోడు ఉపఎన్నికకు ఈ  నెల 15లోపు నోటిఫికేషన్ రావచ్చని బీజేపీ స్టీరింగ్ కమిటీ జాతీయ ప్రధాన  కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్.. బీజేపీపై సెటైర్లు వేశారు.

KTR alleges bJP Misuse investigation agencies says Before EC BJP announces The Poll Dates
Author
First Published Oct 2, 2022, 1:36 PM IST

మునుగోడు ఉపఎన్నికకు ఈ  నెల 15లోపు నోటిఫికేషన్ రావచ్చని బీజేపీ స్టీరింగ్ కమిటీ జాతీయ ప్రధాన  కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్.. బీజేపీపై సెటైర్లు వేశారు. ఎన్నికల కమిషన్‌ కంటే ముందే బీజేపీ నేతలు ఎన్నికల తేదీని ప్రకటిస్తున్నారని విమర్శించారు. అలాగే సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, ఐటీ.. కంటే ముందే బీజేపీ చర్యలను ప్రకటిస్తుందని ఆరోపించారు. బీజేపీ పేరును కూడా మార్చుకోవాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

‘‘ఈసీ కంటే ముందే బీజేపీ పోల్ తేదీలు ప్రకటిస్తుంది!.. ఈడీ కంటే ముందే దాడులు ఎదుర్కొబోయే వారి పేర్లను బీజేపీ ప్రకటిస్తుంది!.. ఎన్‌ఐఏ కంటే ముందే బీజేపీ నిషేధం ఎదుర్కొనే సంస్థలను ప్రకటిస్తుంది!.. ఐటీ అధికారుల కంటే ముందే నగదు మొత్తం ప్రకటిస్తుంది!.. సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లను బీజేపీ ప్రకటిస్తుంది!.. అందుకు తగిన విధంగా బీజేపీ పార్టీ పేరును "BJ...EC-CBI-NIA-IT-ED...P"గా మార్చుకోవాలి’’ అని కేటీఆర్ ట్వీట్ ద్వారా ఆరోపించారు. 

 


అసలు సునీల్ బన్సల్ ఏమన్నారంటే.. 
మునుగోడు ఉప ఎన్నిక‌పై బీజేపీకి చెందిన కీల‌క నేత‌ల‌తో సునీల్ బన్సల్ శనివారం చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల నియమితులైన స్టాండింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ మొదటి వారంలోగానీ రెండో వారంలోగానీ జరిగే అవకాశం ఉన్నందున కార్యాచరణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నియోజకవర్గ, మండల ఇన్‌చార్జిలందరూ నియోజకవర్గంలోనే ఉంటూ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios