మొన్నటి వరకు కేవలం బహిరంగ సభల్లోనే విమర్శించుకునే నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోయాయి. మొన్నటి వరకు కేవలం బహిరంగ సభల్లోనే విమర్శించుకునే నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూ.. మంత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్ కి తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చాడు. ‘‘మహాకూటమి అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుంది. కాంగ్రెస్ నేతలకు వెన్నుమూక, ఆత్మగౌరవం లేవు’’ అంటూ రాహుల్, చంద్రబాబు కూర్చొని ఉండగా.. ఉత్తమ్ నిల్చొని ఉన్న ఫోటోని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఆ ట్వీట్ కి సమాధానంగా ఉత్తమ్ మరో ట్వీట్ చేశారు. తమపై విమర్శలు చేస్తున్నవారందరికీ ఇదే మా సమాధానం అంటూ.. మోదీ, కేసీఆర్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలో కేసీఆర్.. వంగి మరీ మోదీకి షేక్ హ్యాండ్ చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ ఫోటోలు. నా ఫోటోపై కామెంట్ చేసే ముందు మీ తండ్రి ప్రధాని నరేంద్రమోదీ ముందు ఎలా సరెండర్ అయ్యారో చూడండి అంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

కాగా.. వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

related news

రాహుల్, చంద్రబాబుపై కేటీఆర్..టూరిస్ట్ సెటైర్