హైద్రాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్: నీటి కేటాయింపులు సహా కీలకాంశాలపై చర్చ
కేఆర్ఎంబీ సమావేశం ఇవాళ జలసౌధలో ప్రారంభమైంది.
హైదరాబాద్: కేఆర్ఎంబీ సమావేశం బుధవారం నాడు హైద్రాబాద్ జలసౌధలో ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు , ఇతర విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు రెండు రాష్ట్రాల అధికారులు.
గత ఏడాది నుండి కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో సగం సగం చొప్పున కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అయితే తెలంగాణ వాదనపై ఏపీ రాష్ట్రం అభ్యంతరం చెబుతుంది. జూన్ నుండి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా నది జలాల్లో తమకు కూడ సగం కేటాయించాలని ఈ సమావేశంలో తెలంగాణ డిమాండ్ ను విన్పించనుంది. కృష్ణా బోర్డుకు బడ్జెట్ కేటాయింపులపై కూడా చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాలు బోర్డు నిర్వహణకు నిధులు కేటాయించాలి.
మరో వైపు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొనే విషయమై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం కొన్ని ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ విషయమై కూడా చర్చించే అవకాశం ఉంది.