జల విద్యుత్ ను నిలిపివేయండి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ ఆదేశం
శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ను నిలిపివేయలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కేఆర్ఎంబీ ఆదేశించింది.
హైదరాబాద్:Srisaileam ప్రాజెక్టులో జల Electricity Project ను నిలిపివేయాలని KRMB ఆంధ్రప్రదేశ్, Telangana రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలని కూడా కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకొంది. దీంతో కేఆర్ఎంబీ ఈ నిర్ణయం తీసుకొంది. 215 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని గతంలో కూడా కేఆర్ఎంబీ రెండు రాష్ట్రలను ఆదేశించింది. అయితే రెండు రాష్ట్రాలు పోటీ పడి విద్యుత్ ఉత్పత్తిని చేశాయి. దీంతో వేసవికి ముందే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకొంది. రెండు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం ప్రాజెక్టు నుండే 40 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
ఐదు నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్ఎంబీ లేఖలు రాసింది. జలవిద్యుత్తును నిలిపివేయాలని కోరింది. తాగు, సాగు నీటి అవసరాల కోసం మాత్రమే జలవిద్యుత్తు ఉత్పత్తి జరగాలని కోరింది. సాగు, తాగునీటి అవ సరాలు లేకుండానే శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడంతో విలువైన నీరు సముద్రంలో కలుస్తోంది. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వాటర్ ఇయర్‌లో ఇప్పటిదాకా ఐదు నెలలు మాత్రమే పూర్తయ్యాయని ఆ లేఖలో కేఆర్ఎంబీ కోరింది. ఈ లేఖను గతేడాది నవంబరులో కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ విజ్ఞప్తులను తెలుగురాష్ట్రాలు పెడచెవిన పెట్టాయి.
కేఆర్‌ఎంబీ లేఖ రాసిన సమయానికి శ్రీశైలంలో 856.10 అడుగుల దాకా నీటిమట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండేవి. గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీలు ఉండేవి. తాజాగా రెండు రోజుల క్రితం వరకు నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు(812.14 అడుగుల నీటిమట్టం) పడిపోయాయి. కేఆర్‌ఎంబీ లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించాయి. అలా కిందకు వదిలిన నీటిలో కొంత భాగమే సాగుకు అందగా సింహభాగం వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఈ వాటర్ ఇయర్‌లో 1,088.48 టీఎంసీల మేర ఇన్‌ఫ్లో వచ్చినా ప్రస్తుత నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయి.
వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశెలం జలాశయం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉంది. శ్రీశైలం ఎగువన 34 టీఎంసీల వరకు చెన్నై తాగునీటితోపాటు, ఎస్‌ఆర్‌ఎంసీకి నీటి కేటాయింపులు ఉన్నాయి. చెన్నై తాగునీటి కోసం ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 8 టీఎంసీలు ఇవ్వగా 5 టీఎంసీలు మాత్రమే చెన్నైకి చేరాయి. ఏటా నవంబరులోపు రెండు దఫాలుగా నీళ్లు కావాలని చెన్నై కోరుతుండగా ఇప్పటిదాకా ఒకటే దఫా నీళ్లు ఇచ్చారు. మొత్తం సీజన్‌లో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు ఇవ్వాల్సి ఉంటోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఆ రాష్ట్రం నీళ్లు కోరలేదు. వాస్తవానికి నాగార్జునసాగర్‌లో తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికి మాత్రమే శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలి.ఈ దఫానైనా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పాటిస్తాయో చూడాలి