Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: కృష్ణా రివర్ బోర్డు భేటీ

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం బుధవారం నాడు ప్రారంభమైంది. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.
 

Krishna river management board meeting starts today
Author
Hyderabad, First Published May 13, 2020, 2:24 PM IST

హైదరాబాద్:కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం బుధవారం నాడు ప్రారంభమైంది. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం 203 జీవోను  ఈ నెల 5వ తేదీన జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలు ఏడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

also read:88వేల క్యూసెక్కులు తరలించే ప్లాన్: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్

కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కృష్ణా నది మిగులు జలాల పంపకంపై చర్చ జరగనుంది. కృష్ణా బేసీన్ ఉన్న ప్రాంతాలకు నీటి పంపిణీకి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై కూడ సమావేశంలో చర్చించనున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా నష్టపోనుందో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వాదించనున్నారు. మరో వైపు వరద నీటినే తాము ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం కూడ ఈ సమావేశంలో వాదనను విన్పించనుంది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా రివర్ బోర్డు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఈ సమావేశం తర్వాత తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా బోర్డు సెక్రటరీని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios