హైదరాబాద్  కేపీహెచ్‌బీ కాలనీ ఫస్ట్ ఫేజ్‌ ఈడబ్ల్యూఎస్‌ 702 ఇంటిని మధు అనే వ్యక్తి అద్దెకు తీసుకుని గలీజ్ దందా సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. 

హైదరాబాద్: ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఇంటిపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు విటులతో పాటు ఓ యువతి పట్టుబడగా నిర్వహకుడు మాత్రం పరారయ్యాడు. 

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫస్ట్ ఫేజ్‌ ఈడబ్ల్యూఎస్‌ 702 ఇంటిని మధు అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించి ఈ ఇంట్లో వుంచి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ గలీజ్ దందా సాగించాడు. 

read more ప్రేమ పేరిట యువతిని వేధించినవాడే... పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం (వీడియో)

అయితే వ్యభిచార దందా గురించి పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేపట్టారు. పోలీసుల దాడిని గుర్తించిన నిర్వహకుడు మధు పరారయ్యాడు. దీంతో ముగ్గురు యువకులతో పాటు ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామసీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్‌ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార ముఠా నిర్వహికుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.