నా కంటే జూనియర్లకు స్థానం... నాకిది అవమానమే , టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. నిన్న ప్రకటించిన పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే ఆమె తప్పుకున్నట్లుగా తెలుస్తోంది

konda surekha resign to tpcc executive committee

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. నిన్న ప్రకటించిన పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని.. తనకంటే జూనియర్లకు స్థానం కల్పించారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను అవమానించడమేనని ఆమె అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానమే ముఖ్యమని సురేఖ అన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ సామాన్య కార్యకర్తలా కొనసాగుతానని ఆమె తెలిపారు. 

ఇకపోతే.. తెలంగాణ పీసీసీ కొత్త కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అలాగే 24 మంది ఉపాధ్యక్షులను, 84 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. 

ALso Read:ఏఐసీసీ జాబితాలో దొర్లిన తప్పు.. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుని విషయంలో గందరగోళం..

ఇక, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, జగ్గారెడ్డిలను పార్టీ హైకమాండ్ అపాయింట్ చేసింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి  విక్రమార్క, వీ హనుమంతరావు(వీహెచ్), పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, టీ జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లకు చోటు కల్పించారు. ఇక, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రేవంత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios