హన్మకొండలోని ఆమె నివాసంలో పరకాల నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.  

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె అన్నారు. హన్మకొండలోని ఆమె నివాసంలో పరకాల నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. 

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సీఎం కేసీఆర్‌ నిరంకుశ పాలన చేస్తున్నాడన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్‌, కొండా దంపతులకు బలమన్నారు. తమపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులను, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటామన్నారు. 


మండలం లో ఇటీవల అనారోగ్యాలతో మృతి చెందిన వైనాల ఉప్పలయ్య, రాగుల సుధాకర్‌ కుటుంబాలను సురేఖ పరామర్శించారు. అనార్యోగంతో చికిత్స పొందుతున్న బయ్య శ్రీకాంత్‌, రాజులను పరామర్శించారు. కార్యక్రమంలో రాహుల్‌ యువసేన రాష్ట్ర నాయకుడు పర్వతగిరి రాజు, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ఉప్పుల సుదర్శన్‌, తనుగుల సందీప్‌, తాళ్ల చింటూ, పొదిల రాకేష్‌, వైనాల పవన్‌, కానుగంటి చందు పాల్గొన్నారు.