కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ గడచిన అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవడానికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఓడగొట్టారని కొండా మురళీ ఆరోపించారు.

ఈ రోజు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం కొండా దంపతులు మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా తమ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడం తమకు నచ్చలేదన్నారు.

తాజా మంత్రివర్గంలో ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారని కొండా మురళీ ఆరోపించారు. ప్రజల అండతో దొరల పాలనను ప్రతిఘటించి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆయన రాజీనామా లేఖ ఇచ్చిన గంట వ్యవధిలోనే మురళీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు శానసమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

ముందు భోజనం పెడతారు.. తర్వాత అపాయింట్‌మెంట్ దొరకదు: కొండా మురళీ

ఆ "సాఫ్ట్‌వేర్" కంపెనీ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సురేఖ సంచలన వ్యాఖ్యలు

కొండా మురళీ రాజీనామాకు గంటలోనే ఆమోదం