Asianet News TeluguAsianet News Telugu

ఆ "సాఫ్ట్‌వేర్" కంపెనీ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సురేఖ సంచలన వ్యాఖ్యలు

మాకు రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి భయం లేదన్నారు కాంగ్రెస్ నేత కొండా సురేఖ. ఇవాళ ఆమె తన భర్త కొండా మురళీధర్‌రావుతో కలిసి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో సమావేశమయ్యారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా తాము జనంలో ఉంటామని.. జనం తమ వెంట ఉన్నారన్నారు. 

konda surekha sensational comments on TRS Victory
Author
Hyderabad, First Published Dec 22, 2018, 12:25 PM IST

మాకు రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి భయం లేదన్నారు కాంగ్రెస్ నేత కొండా సురేఖ. ఇవాళ ఆమె తన భర్త కొండా మురళీధర్‌రావుతో కలిసి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో సమావేశమయ్యారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా తాము జనంలో ఉంటామని.. జనం తమ వెంట ఉన్నారన్నారు. అధికారులు కూడా మమ్మల్ని గౌరవిస్తారని.. తాము కోరిన పనులు చేసిపెడతారని సురేఖ స్పష్టం చేశారు.

ఎన్నికలు ముగిసి 15 రోజులు గడవకముందే మురళీధర్ రావుకి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. మరి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన వారి అనర్హత ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోరు గానీ టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళితే మాత్రం వెంటనే నోటీసులు ఇవ్వడమేంటీ అంటూ ఆమె ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎమ్మెల్సీ పదవికి ముందే రాజీనామా చేయాలని మురళీ ముందే నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు. కేసీఆర్ వల్ల మేం పదవిని అనుభవిస్తున్నామన్న భావన వారిలో ఉన్నప్పుడు... ఆ పదవి మాకు అక్కర్లేదు.. అందుకే రాజీనామా చేశామని సురేఖ స్పష్టం చేశారు.

రాబోయే పంచాయతీ, మున్సిపల్, కో-ఆపరేటివ్, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరిపోతాయని సురేఖ అన్నారు. అన్ని ప్రిపేర్ చేసుకునే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని.. ఊళ్లకు డబ్బు, మద్యం ముందే పంపించారని ఆమె ఆరోపించారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా పావులు కదిపారని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే కేటీఆర్ కూడా మాకు 90 నుంచి 100 లోపు వస్తాయని.. ఎవరెవరు ఓడిపోతారో అంత ఖచ్చితంగా చెప్పగలిగారని ఆమె అన్నారు. కేసీఆర్ సైతం వ్యతిరేకత ఎదుర్కొన్నారని అలాంటప్పుడు టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం వెనుక అనుమానాలున్నాయని సురేఖ అన్నారు.

పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఏనాడు గ్రామాల్లోకి వెళ్లలేదని... టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో పాటు అనేక కాంట్రాక్టులు సంపాదించారని ఆమె ఆరోపించారు. కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ల కన్నా ముందు ఈవీఎం ఓట్లనే లెక్కించాలని ధర్మారెడ్డి అన్నారని దీనిని బట్టి ఏదో జరిగి ఉంటుందని సురేఖ సందేహం వ్యక్తం చేశారు. 

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

ముందు భోజనం పెడతారు.. తర్వాత అపాయింట్‌మెంట్ దొరకదు: కొండా మురళీ

Follow Us:
Download App:
  • android
  • ios