ఎమ్మెల్సీ పదవికి కొండా మురళీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా లేఖ సమర్పించిన గంటలోపే దానికి ఆమోదం లభించింది. కొండా మురళీ రాజీనామాను ఆమోదిస్తూ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు. 

గతంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మురళీ ఆ తర్వాత భార్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ కాంగ్రెస్ తరపున పరకాల నుంచి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మురళీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ పార్టీ ప్రతినిధులు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన షోకాజ్ నోటీస్ పంపేలోపు మురళీ రాజీనామా చేశారు. 

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

ముందు భోజనం పెడతారు.. తర్వాత అపాయింట్‌మెంట్ దొరకదు: కొండా మురళీ

ఆ "సాఫ్ట్‌వేర్" కంపెనీ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సురేఖ సంచలన వ్యాఖ్యలు