Asianet News TeluguAsianet News Telugu

ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి సిగ్గుండాలి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఓయూలో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతారా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్ర‌శ్నించారు. ఓ పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి సిగ్గుండాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  
 

komatireddy venkat reddy visited mahabubabad district
Author
Hyderabad, First Published Jan 29, 2022, 4:50 PM IST

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఓయూలో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతారా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్ర‌శ్నించారు. ఓ పక్క నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి సిగ్గుండాలని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

సీఎం కేసీఆర్‌ 68వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ‘సీ’ గ్రౌండ్‌లో శుక్రవారం టోర్నమెంట్‌ ప్రారంభమైంది.
ఈ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు హాజరయ్యారు. 

అయితే.. ఈ టోర్న‌మెంట్ ను వ్య‌తిరేకిస్తూ.. విద్యార్థి నేతలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఈ టోర్న‌మెంట్  అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఓయూ క్యాంప‌స్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల ఫ్లెక్సీలను విద్యార్థులు చించేశారు. ఫ్లెక్సీలను తగలబెట్టి విద్యార్థి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూలో అడుగుపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. 

ఈ ఘ‌ట‌నపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి అధికార తెరాస పార్టీ సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంతృత్వ పాల‌న‌లో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
సీఎం కేసీఆర్ పేరుమీద ఉస్మానియా వర్సిటీలో టీఆర్ఎస్ నేతలు టోర్నమెంట్ పెట్టారని మండిపడ్డారు. 
సీఎం కేసీఆర్ కు పోయేకాలం దగ్గర పడిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
కాగా, మహబూబాద్ జిల్లా బయ్యారంలో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబాన్నికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పి.. లక్ష రూపాల ఆర్ధిక సహాయాన్ని కూడా అందించాను. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, మూడు ఎకరాల  వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నిరుద్యోగులు ఎవరూ అధైర్యప‌డ‌వొద్ద‌నీ, తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల జీవితాల‌తో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల‌ను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాను. ఇది నీకు న్యాయమేనా? నీకు కూడా బిడ్డలు ఉన్నారు... నిరుద్యోగుల గురించి ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. నాకు పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎంపీ పదవులు మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాను. 

Follow Us:
Download App:
  • android
  • ios