ఈటల రాజేందర్ నాకు బామ్మర్ది : కోమటిరెడ్డి (వీడియో)

KomatiReddy says Etela is his brother-in-law
Highlights

కేసిఆర్ పైనా హాట్ కామెంట్స్

నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈటల రాజేందర్ గురించి ఒక కామెంట్ చేశారు. ఈటల వరుసకు తనకు బామ్మర్ది అవుతారని అన్నారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంలో కేసిఆర్ తప్ప అందరూ తనకు మంచి దోస్తులే అన్నారు.

ఈటల అత్తగారి ఊరు మన ఊరి పక్కనే అన్నారు. ఈ సంభాషణ అంతా కోమటిరెడ్డి తన అనుచరుల వద్ద ఉన్న సమయంలో చేశారు. తన సన్నిహితుల ముందే కోమటిరెడ్డి మంత్రి ఈటల రాజేందర్ తో స్పీకర్ ఆన్ చేసి ఫోన్లో మాట్లాడారు. పార్టీ మారనందుకే తనమీద కేసిఆర్ గుర్రుగా ఉన్నట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

"

కోమటిరెడ్డి మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతుండగా ఆయన అనుచరులు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలోకి వదలారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కోమటిరెడ్డి ఏమన్నారో పైన వీడియోలో ఉంది చూడండి.

loader