హైదరాబాద్: సీఎల్పీ భేటీ నుండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పీసీసీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.

ఆదివారం నాడు సీఎల్పీ  సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కొద్దిసేపు పాల్గొన్న తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌‌లో  ఓ నేత మరణించినందునే తాను వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.తాను పార్టీ మారేందుకు సమావేశం నుండి వెళ్లిపోవడం లేదిన కూడ ఆయన ప్రకటించారు.

మరోవైపు సీఎల్పీ భేటీ నుండి బయటకు వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అదే నాయకత్వంతో పార్లమెంట్  ఎన్నకలకు ఎలా వెళ్తామని ఆయన ప్రశ్నించారు. 

పీసీసీ నాయకత్వాన్ని కూడ మార్చాలని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మార్చారు. టీఆర్ఎస్ నాయకత్వం మూడు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే, తమ పార్టీ నాయకత్వం మాత్రం నామినేషన్ల దాఖలు చివరి నిమిషంలో  టిక్కెట్లను  కేటాయించారని చెప్పారు.

ఇతర పార్టీలతో పొత్తుల విషయమై నెలల తరబడి జాప్యం చేశారని ఆయన విమర్శించారు. శత్రువు బలమైన వ్యక్తి...  అందుకే బలమైన నాయకత్వం పీసీసీకి ఉండాలని  ఆయన డిమాండ్ చేశారు. బలమైన నాయకత్వం ఉంటేనే  తెలంగాణలో పార్టీని బతికించుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్: సీఎల్పీ అత్యవసర భేటీ