కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బీజేపీలో మంగళవారం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మరోవైపు తనకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదంటూ అలకబూనిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం కీలక బాధ్యతలను కట్టబెట్టింది అధిష్టానం. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పార్టీ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.

