తమను అకారణంగా సభ నుంచి సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వాపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో వారు భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఖర్గేకు తమ సస్పెన్షన్ తాలూకు వివరాలు అందజేశారు.

రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఖర్గే ను కలిసి తెలంగాణ అసెంబ్లీ లో జరిగిన అంశాలను పూర్తిగా వివరించారు కోమటి రెడ్డి, సంపత్. చట్ట సభలోనే చట్ట వ్యతిరేకంగా తమను ఎలాంటి ఆధారాలు లేకుండా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని వివరించారు.

12 వ తేదీన అసెంబ్లీ లో జరిగిన అన్ని రకాల వీడియోలు పేపర్ క్లిప్పింగ్స్, ఉద్దేశ్య పూర్వకంగా తమపై చర్యలు తీసుకున్న అంశాలను ఖర్గే కు అందజేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్.

వారి సస్పెన్షన్ అంశాన్ని సోమవారం నాడు లోకసభలో అంశాన్ని ప్రస్తావిస్తానని ఖర్గే హామీ వీరికి హామీ ఇచ్చారు.