సాధారణంగా రాజకీయ పార్టీలకే గ్రామ కమిటీలు.. ఇంకా కింద వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఉంటాయి. జెఎసి ఈ దారిలో పయనిస్తున్నది

జెఎసి ఒక రాజకీయ పార్టీ రూపం తీసుకోబోతున్నది.నిన్నజరిగిన జెఎసి స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు చూస్తే జెఎసి పార్టీ హంగులు సమకూర్చుకోబోతున్నదని పిస్తుంది.

జెఎసిని ప్రతిగ్రామానికి విస్తరింపచేయాలని పార్టీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.

ఈ నెల 22 నాటికి మండల కమిటీలను నియమిస్తారు.తర్వాత మే నాటికి గ్రామ స్థాయి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ పని పూర్తయితే, ఇలాంటి నెట్ వర్క్ ఉన్న అర్గనైజేషన్ రాష్ట్రంలో జెఎసియే అవుతుంది. ఏ రాజకీయ పార్టీకి కూడా గ్రామస్థాయిలో కమిటీలు ఉన్నట్లు లేవు.

పార్టీలాగా జెఎసి ఎదగాలన్న లక్ష్యం లేక పోతే ఇంత నిర్మాణం అవసరమా... సాధారణంగా రాజకీయ పార్టీలకే గ్రామ కమిటీలు.. ఇంకా కింద వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఉంటాయి. జెఎసి ఈ దారిలో పయనిస్తున్నట్లున్నది.

 జెఎసిఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండ్ రామ్ వేసవి లేక్కచేయకుండా ఇలా నిర్మాణం కార్యక్ర మంలోనిమగ్నమవుతున్నాడంటే ఆయనేదో భారీ స్కెచ్ వేస్తున్నట్లనిపిస్తుంది. అంతేకాదు, ఇతర రాజకీయ పార్టీల్లో క్రీయాశీలంగా ఉన్న వారికి జెఎసిలో బాధ్యతలను ఇవ్వబోమని కూడా కోదండరామ్ స్పష్టం చేశారు.

సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు:

*బొగ్గు గనుల లో ఓపెన్ కాస్ట్ (ఉపరితల తవ్వకాలు)లకు వ్యతిరేకంగా, ధర్నాచౌక్ పరిరక్షణకు త్వరలోనే వేర్వేరుగా అఖిలపక్ష సమావేశాలు.

* వివిధ ప్రభుత్వ రంగాల పై జెఎసి రాష్ట్రస్థాయి ప్రతినిధులకు ఈనెల 23 న హైదరాబాద్‌లో అవగాహన తరగతులు.

*మంథనికి చెందిన మధూకర్ హత్య ఘట న విషయంలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం.

*సింగ రేణిలో వారసత్వ ఉద్యోగాల అంశంపై ఈ నెల 10న మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌లో సదస్సు.

*నిజాం షుగర్ కంపెనీ పరిరక్షణకు ఈ నెల 17న బోధన్ నుంచి నిజామాబాద్ వరకు జెఎసి ఆధ్వ ర్యంలో ర్యాలీ.

*హరితహారంలో భూములు కోల్పోతున్న ఆదివాసుల ప్రాంతాలలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు పర్యటన

*ఈ నెలలో నిరుద్యోగ సమస్యలపై విద్యార్థి జెఎసి చేపట్టినున్న సభకు తమ సంపూర్ణ మద్దతు

*విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, వృత్తులు, విద్య, వైద్యం, ఉపాధి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, వర్తమాన పరిసిస్థితులపై జిల్లా, మండల స్థాయిలో జెఎసి శ్రేణులకు అవగాహన తరగతులు.

ఈ సమావేశంలో జెఎసి కో-ఛైర్మన్లు ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఖాజా మొయినుద్దీన్, కన్వీనర్ కె.రఘు, ప్రతినిధులు సంధ్య, జి.వెంకట్‌రెడ్డి, గురిజాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.