అప్పుడే కేసిఆర్ పై డోస్ పెంచిన కోదండరాం

First Published 2, Apr 2018, 9:12 PM IST
kodandaram slams kcr immediately after telangana jana samithi formation
Highlights
24 గంటలు గడవకముందే రాజకీయ వేడి రగిలించిన కోదండరాం

తెలంగాణ సిఎం కేసిఆర్ పై విమర్శల డోస్ పెంచారు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం. తెలంగాణ జెఎసి ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో తెలంగాణ సిఎం కేసిఆర్ మీద సాఫ్ట్ లాంగ్వేజీలో కోదండరాం మాట్లాడేవారు. కానీ రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన రోజే మాటల దాడి పెంచారు. విమర్శల్లో వేడి పెంచారు. సోమవారం సాయంత్రం కోదండరాం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసిఆర్ నిరంకుశ పాలన అంతం చేద్దాం.. కలిసి రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ జన సమితి పేరుతో కోదండరాం తొలిరోజు విడుదల చేసిన తొలి ప్రకటన ఇది. పత్రికా ప్రకటన యదాతదంగా కింద ఇస్తున్నాం చదవండి.

పత్రికా ప్రకటన

తెలంగాణ జన సమితి

02-04-2018

ప్రచురణార్ధం

********

ప్రొ. కోదండరాం.

********

మేము రాజకీయ రంగంలోనికి ప్రవేశిస్తున్నామని గతంలో ప్రక్రటించిన విషయం మీకందరికి తెలిసిన విషయమే.  రాజకీయ రంగంలో మా కార్యచరణను వివరించడానికి ఈ రోజు పత్రికా సమావేశాన్నిఏర్పాటు చేసాం. తెలంగాణ వాదులు, ఉద్యమ కారుల నాలుగు సంవత్సరాల అనుభవాల ఆధారంగా లేవనెత్తిన చర్చ ఈ నిర్ణయానికి దారి తీసింది. 

చర్చలో వచ్చిన అంశాలపై ఎంతో అంతర్మథనం  మరెంతో మేథోమధనం జరిపిన తరువాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాం.

ముఖ్యంగా మూడు విషయాలు మా ఆలోచనలను ప్రభావితం చేసినాయి.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న పాలనను సరిచేసే అవసరం ఏర్పడింది.

ఉద్యమ కాలంలో అనుకున్నట్టుగా ఏ వర్గానికి న్యాయం జరగలేదు. 

రైతులు, నిరుద్యోగులు..ఉద్యోగులు..కార్మికులు అందరూ నైరాష్యంలో ఉన్నారు. పాలకుల్లో మార్పు వచ్చింది కాని పాలనలో మార్పు రాలేదు.

తెలంగాణలో  ప్రజాస్వామిక విలువలు అడుగంటిపోతున్నాయి. సభలు , సమావేశాలకు నిర్వహించుకునే అవకాశం లేదు.

రాష్ట్రంలో ఏక వ్యక్తి నిరంకుశ పాలన సాగుతోంది.  మార్పుపౌర సమాజం, ఉద్యమాలతో సాద్యమని నిర్ణయానికి వచ్చి ఇంత కాలం ఉద్యమించాం.

కాని ప్రభుత్వం  తీవ్ర నిర్బంధం విధించింది. ఈ  నియంతృత్వ పాలనను కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రావాల్సి వచ్చింది.

ఫిబ్రవరి నాలుగు నాడు జేఏసీ సమావేశంలో పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాము. ఆ తరువాత చాలా గ్రూపు మీటింగులు అంతర్గతంగా జరిగినాయి.

లక్ష్య ప్రకటణపై స్థూలమైన అంగీకారానికి వచ్చినాము. రాజ్యాంగ నీతికి లోబడి అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ది  సామాజికి న్యాయం లక్ష్యంగా సాగాలని , ప్రజాస్వామిక సమాజంగా తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నాము.

పార్టీ నియమ నిబంధనావళి తయారు చేసుకున్నాం.

పార్టీ  పేరును తెలంగాణ జన సమితిగా ఖరారు చేసుకున్నాము. జెండా కూర్పు చేయడానికి చిత్రకారులు , ఇతర నిపుణుల సహకారం తీసుకుంటున్నాము.  ఇప్పటికే లక్షలాది మందికి జెండా వివరాలు చేరాయి. వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు వస్తున్నాయి. 

జెండా పూర్తి వివరాలు 4-4-18 నాడు అధికారికంగా ప్రకిటిస్తాం.

29-04-18 నాడు పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆవిర్భావ సభ నిర్వహణకు సన్నాహాక కమిటీలను రాష్ట్ర స్థాయిలోను..జిల్లాలలోను ఏర్పాటు చేసుకున్నాము. 

రాష్ట్ర స్థాయి సన్నాహాక కమిటీలో సభ్యులు, మళ్లీ 11 సబ్ కమిటీలుగా ఏర్పడి పని భాద్యతలు నిర్వహిస్తున్నారు. 

సభ నిర్వహణకు కావాల్సిన గ్రౌండ్ మరియు ఇతర పోలీసు అనుమతుల కోసం దరఖాస్తులు చేశాము. 

సభకు ప్రజలను సమీకరించడానికి 5 వ తేదీ నుంచి సదస్సులు, సమావేశాలు..ర్యాలీలు..జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ముమ్మరంగా 

జరపాలని , ఇతర ప్రచార రూపాలన్నింటిని ఉపయోగించుకోని ప్రతి ఇంటికి పార్టీ ఆవిర్భావ సమాచారాన్ని చేరవేయాలని 19-03-18 నాడు జరిగిన రాష్ట్ర్ర స్థాయి సమావేశంలో నిర్ణయించినాము. 

తెలంగాణ జన సమితిని ఆశిర్వదించాలని.. రాష్ట్ర ప్రజలంతా  పెద్దఎత్తున హాజరై ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము.   రాష్ట్రంలో నిరంకుశ పాలనను

అంతం చేయడానికి తెలంగాణ జన సమితికి సహకరించాలని మనవి చేస్తున్నాము.

**********

ప్రొ.కోదండరాం

తెలంగాణ జన సమితి

loader