కేసిఆర్ ఫ్రంట్ పై కోదండరాం హాట్ కామెంట్

First Published 21, Mar 2018, 3:06 PM IST
Kodandaram slams KCR for his third front drama
Highlights
  • మూడో ఫ్రంట్ అయ్యేది కాదు ఏం కాదు
  • గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు ట్రై చేసి ఫెయిల్ అయిర్రు
  • తెలంగాణలో రైతులు సంతోషంగా లేరు


తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న మూడో ఫ్రంట్ పై తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం స్పందించారు. మూడో ఫ్రంట్ ఉత్త ముచ్చటే అని తేల్చా పారేశారు. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడం మంచిదే అయినా.. అది కేసిఆర్ తో సాధ్యం కాదని చెప్పారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు సైతం మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని గుర్తు చేశారు.

తెలంగాణలో ఏమీ చేయలేని కేసిఆర్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీలో ఉద్ధరిస్తడట అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులను పట్టించుకోనోడు.. దేశ రూపు రేఖలు మారుస్తానని ప్రకటనలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసిఆర్ ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లిలో జరిగిన రైతు సభలో కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో తాము ఇప్పటి వరకు 500 గ్రామాల్లో పర్యటించానని చెప్పారు. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడితే ఒక్కరు కూడా తెలంగాణ సర్కారు వల్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పలేదన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జెఎసి వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

loader