Asianet News TeluguAsianet News Telugu

పథకాలు మనకు... ఫలహారం వాళ్లకు...

టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు  ఆంధ్రా వారేనని, రాష్ట్రంలో పాలన కూడా ఆంధ్రా పెత్తందారుల చేతుల్లోనే ఉందని అంటున్నారు.

kodandaram says ts govt still in andhra contractors hand

 

అధికార టీఆర్ఎస్ పార్టీ పాలనపై  తెలంగాణ రాజకీయ జేఏసీ నెమ్మదిగా స్వరం పెంచుతోంది. గులాబీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేసినా టీ జేఏసీ నాయకులు మాత్రం తమ స్థాయికి తగ్గట్టుగానే ప్రభుత్వ విధానాలపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 

ఇటీవలే పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వ పనితీరును కడిగిపారేసిన టీ జేఏసీ నేతలు ఉద్యమ సమయంలో తామే బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీలతోనూ ఇప్పుడు కలిసిపని చేస్తుండటం గమనార్హం. ఇక తెలంగాణ కు పూర్తి వ్యతిరేకంగా పనిచేసిన సీపీఎం పాదయాత్రల సభలకు హాజరవుతూ ప్రభుత్వ ధోరిణిపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు.ఇలా అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతీ గొంతుకు టీ జేఏసీ బహిరంగంగానే మద్దతిస్తున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.

 

మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు, నిరుద్యోగుల సమస్యలు, ఎన్నికల హామీల తదితర అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వచ్చిన టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇప్పుడు కొద్దిగా రూటు మార్చారు.  

 

ఈసారి తన బాణాలను ఆంధ్రా పెత్తందారులపై సంధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఇంకా ఇక్కడ ఆంధ్రా పెత్తందారుల ఆధిపత్యమే నడుస్తోందని సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడారు.

 

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు అంతా ఆంధ్రా వారేనని పేర్కొన్నారు. నాడు తెలంగాణను వ్యతిరేకించిన వారే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా మారారని ఆరోపించారు.

 

ప్రస్తుతం ఉద్యమ ఆకాంక్షకు, ఉద్యమ వ్యతిరేకులకు మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. ఆంధ్రా కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీని ప్రభుత్వం ప్రశ్నించడం లేదని విమర్శించారు. లక్షల ఉద్యోగాలు ఏ కాకి ఎత్తుకుపోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios