తెలంగాణ జన సమితి జెండా ఇదే

First Published 4, Apr 2018, 1:33 PM IST
Kodandaram releases TJS flag with brilliant colors
Highlights
టిజెఎస్ పార్టీ జెండాను ప్రకటించిన కోదండరాం

తెలంగాణ జన సమితి జెండాను కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత జెండాకు ఒక రూపం ఇచ్చారు జన సమితి నేతలు.

జెండాలో సింహభాగం పాలపిట్ట రంగు ఆక్రమించింది. పైన పాలపిట్ట రంగులో జెండా ఉంది. కింద భాగంలో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పైన ఉన్న పాలపిట్ట రంగు లో ఉన్న భాగంలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్ ఉంది. అందులో తెల్ల రంగులో అమర వీరుల స్థూపం ఉంది.

కింద భాగం ఆకుపచ్చ రంగు ఉన్న ప్రాంతంలో తెల్ల రంగులో తెలంగాణ జన సమితి అనే పార్టీ పేరు రాసి ఉంది.

ఈ జెండా రూపకల్పన కోసం పార్టీ నేతలు ముందుగానే జనాల్లో చర్చ పెట్టారు. మూడు నమూనాలు ఇచ్చి వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలంటూ ప్రజలను ఆహ్వానించారు. దీనికి ఎక్కువ మంది సూచించిన దానిని ప్రకటించారు కోదండరాం.

loader