Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం తీసుకున్న షాకింగ్ డెషిషన్ ఇదే

తెలంగాణ జన సమితి నేత కోదండరాం ఒక షాకింగ్ డెషిషన్ తీసుకున్నారు. దేశ చరిత్రలో చేతి వేళ్ల మీద లెక్కపెట్టే పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరిస్తుంటాయి.

kodandaram not to accept donations from contractors and businessmen

తెలంగాణ జన సమితి నేత కోదండరాం ఒక షాకింగ్ డెషిషన్ తీసుకున్నారు. దేశ చరిత్రలో చేతి వేళ్ల మీద లెక్కపెట్టే పార్టీలు మాత్రమే ఇలా వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడు అటువంటి పార్టీల జాబితాలో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి కూడా చేరిపోయింది. మరి అంత షాకింగ్ నిర్ణయం ఏందో చదవండి కింద.

ఈనెల 29 సరూర్ నగర్ లో జరిగే తెలంగాణ జనసమితి ఆవిర్బావ సభకు అన్నీ అనుమతులు లభించాయి. పెద్దపెద్ద కాంట్రాక్టర్లు, కార్పోరేట్ సంస్థల నుంచి నిధులు సేకరించకూడదని నిర్ణయించాం. సామాన్య ప్రజల నుంచే చందాలు వసూలూ చేస్తున్నాం. సభ కోసం పోస్టర్లు, వాల్ రైటింగ్ ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. 12 రకాలు కమిటీలు సభ నిర్వాహణకోసం కష్టపడి పనిచేస్తున్నాయి. సభ నిర్వహణకు వాలెంటీర్లకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చాం. పార్టీ పై ప్రత్యేక పాటలు రూపోందించాం.

ప్రతీ జిల్లా వారు వాళ్ల వాళ్ల జిల్లొనే కాకుండ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ల జిల్లా వాసులకోసం ప్రచారం చేయాలని సంకల్పించాం. అమరుల స్పృతి చిహ్నం కోసం సభ కు వచ్చే  ప్రతీ రైతు ఒక కర్రు ముక్క తీసుకురావాలి. దీనితో అమరుల స్పృతి చిహ్నాన్ని నిర్మిస్తం.

సమావేశంలో స్టేడియం సిట్టింగ డిజైనర్ చింతా స్వామి మాట్లాడారు. ఆయనేమన్నారంటే?

వేదిక మీద వెయ్యి మంది కూర్చునేలా డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ లో కీలక పాత్ర పోషించిన వారిని కుడి వైపున మూడొందల మందిని కూర్చొపెడతాం. అమరవీరుల కుటంబాలను, నేరెళ్ళ దళితులను, ఖమ్మంలో బేడిలు వేయబడ్డ రైతులను, ప్రాజెక్టు ల కింద భూమిని కొల్పోయిన భూ నిర్వసితులను వేదికపైకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం పోరాటం 60 సంవత్సరాల స్పూర్తిగా అమరుల త్యాగాల గుర్తుగా అమరవీరుల స్పూపాన్ని 60 ఫీట్ల ఏత్తుతో నిర్మిస్తున్నాం.

సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఏమన్నారంటే?

29న సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 5 గంటల నుంచి 5:15 మధ్యలో అమమరులకు నివాళ్ళు అర్పిస్తారు. 6:40 కి ప్రభుత్వ నిర్బందాలూ వైఫల్యాల పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios