తెలంగాణలో అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన రికార్డులు సాధించిన వ్యక్తి మంత్రి హరీష్ రావు సొంతం. రికార్డులు సృష్టించాలన్నా వాటిని తిరగరాయాలన్నా హరీష్ రావుకే దక్కింది.  ఉమ్మడి రాష్ట్రమైనా, తెలంగాణ రాష్ట్రమైనా హరీష్ రావు రికార్డుల మోతలో తేడాలేదు.

ఉమ్మడి రాష్ట్రమైనా, తెలంగాణ రాష్ట్రమైనా హరీష్ రావు రికార్డుల మోతలో తేడాలేదు.

కానీ తాజాగా జెఎసి అమరవీరుల స్పూర్తి యాత్ర ముగింపు సభ సిద్ధిపేటలో తలపెట్టింది. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడంతో హరీష్ కోటలో జెఎసి జెండా ఎగిరిందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

జెఎసి తన స్పూర్తి యాత్రను జయశంకర్ సార్ వర్ధంతి నాడే మొదలు పెట్టింది. తొలి దశ యాత్రను కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేసింది. కెసిఆర్ కోటలో జెఎసి యాత్ర ఎలా జరుగుతుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

కానీ నాలుగు రోజులపాటు జరిగిన స్పూర్తి యాత్రకు జనాలు భారీగా మద్దతు పలికారు. దీంతో ఇటు అధికార పార్టీలో అటు మిగతా ప్రతిపక్ష పార్టీల్లో సైతం జెఎసి స్పూర్తి యాత్ర చర్చనీయాంశమైంది.

గులాబీ దళపతి కెసిఆర్ సొంత జిల్లాలో యాత్ర జరగడంతో టిఆర్ఎస్ పార్టీ యాత్రను ఆసక్తిగా వాచ్ చేస్తోంది. మిగతా జిల్లాల్లో యాత్ర పైనా అంచనా వేస్తోంది.

రానున్న రోజుల్లో మిగతా జిల్లాల్లో స్పూర్తి యాత్రకు జెఎసి ప్లాన్ రూపొందించనుంది.