తెలంగాణ వ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వర్షం వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రకటన కింద ఉంది చదవండి.

1 .కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చాలా మందకొడిగా సాగుతున్నది.చాలా మంది రైతులు రోజుల తలబడి మార్కెట్లలో తూకం కోసం ఏదురు చూడవలసి వస్తున్నది.కేవలం కొనుగోళ్ళు ఆలస్యం కావడం వల్లనే చాలా మంది రైతులు సమయానికి అమ్ముకోలేక పోయారు.అందువలన ధాన్యం తడిచి నష్టపోయారు.

2 .యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలి.

3 .ఆకాల వర్షం వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి.

4 .అరటి ,మామిడి పంటలు పూర్తిగా ధ్వంసం అయి పోయినందున ఆయా ప్రాంతాల రెవిన్యూ మరియు వ్యవసాయ అధికారులు స్పందించి వారికి తగిన సాయం అందేలా చర్యలు చేపట్టాలి.

5 . పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం పిడుగుల బారిన పడి ౧౦ మంది చనిపోయారు.ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలి.భాదిత కుటుంబాలను ఆదుకోవాలి.

ఇట్లు..

ప్రొ.కోదండరాం
అధ్యక్షులు
తెలంగాణ జన సమితి.