Asianet News TeluguAsianet News Telugu

అది మా పార్టీ ఎన్నికల స్ట్రాటజీ.. అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి: కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy Comments About BJP Candidate List for telangana Assembly elections 2023 ksm
Author
First Published Oct 9, 2023, 10:59 AM IST

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉందని అన్నారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ ఎన్నికల స్ట్రాటజీ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోందని అన్నారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను జాతికి అంకితం చేయనున్నట్టుగా చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని చెప్పారు. 

ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే త్వరగా పనులు పూర్తిచేస్తామని అన్నారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌కు భూమిపూజ చేసుకున్నామని తెలిపారు. ఆర్ఎంయూ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని చెప్పారు. 


సిద్దిపేటలో రాష్ట్ర మంత్రులు రైల్వే అధికారులను తిడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రైల్వే పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైల్వే అధికారులను తిడితే ఊరుకోమని  అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios