తనతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ప్రియుడు తనను దూరం పెట్టాడనే నెపంతో ఓ వివాహిత ప్రియుడి కూతురిని కిడ్నాప్ చేసింది.  కిడ్నాప్  చేసిన  బాలికతో  కేరళలో ఉన్న ఆమెను నిజామాబాద్‌కు తీసుకొచ్చేందుకు  కేరళకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

నిజామాబాద్: తనతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ప్రియుడు తనను దూరం పెట్టాడనే నెపంతో ఓ వివాహిత ప్రియుడి కూతురిని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన బాలికతో కేరళలో ఉన్న ఆమెను నిజామాబాద్‌కు తీసుకొచ్చేందుకు కేరళకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది.ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం వన్నెల్ గ్రామానికి చెందిన రమేష్, హరిత భార్య, భర్తలు. వీరి పెద్ద కుమార్తె మణీశ్వరీకి ఐదేళ్లు. నందిపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మణీశ్వరీ యూకేజీ చదువుతోంది. రమేష్‌కు అదే గ్రామానికి చెందిన రజితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా ఈ వ్యవహరాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు.

అయితే ఈ విషయం బయటకు తెలిసింది. దీంతో రమేష్ దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ కారణంగా రమేష్ రజితను దూరం పెట్టాడు. ప్రియుడు తనను దూరం పెట్టడంతో తట్టుకోలేక పోయిన రజిత... రమేష్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించుకొంది. 

ఈ నెల 2వ తేదీన గీతాంజలి స్కూల్ లో చదువుతున్న మణీశ్వరీని రజిత కిడ్నాప్ చేసింది. తన కూతురుతోపాటు మణీశ్వరీని తీసుకొని రజిత కేరళకు వెళ్లింది. స్కూల్ కు వెళ్లిన కూతురు కన్పించకపోవడంతో రమేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై సీసీ పుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. 

మణీశ్వరీని తీసుకొని రజిత కేరళకు వెళ్లిందని గుర్తించారు. కేరళలోని తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న రజితను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

మణీశ్వరీ మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా కేరళ పోలీసులు నిజామాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు.కేరళ పోలీసుల సమాచారంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన పోలీసులు కేరళకు వెళ్లారు. కేరళలో ఉన్న రజితను తీసుకురానున్నారు.