మహబూబాబాద్: కిడ్నాపైన బాలుడు దీక్షిత్ కథ విషాదాంతమైంది. 9 ఏల్ల బాలుడి శవం మహబూబాబాద్ శివారులో కనిపించింది. గత ఆదివారం మహబూబాబాద్ నుంచి దీక్షిత్ కిడ్నాపైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు బాలుడిని అప్పగించడానికి 45 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 

బాలుడిని కిడ్నాపర్లు హత్య చేశారు. కిడ్నాపర్లకు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. తమ కుమారుడిని దుండగులు హత్య చేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: మహబూబాబాద్‌లో 9 ఏళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 45 లక్షలు డిమాండ్

గత నాలుగు రోజులుగా కిడ్నాపర్ల కోసం వంద మంది పోలీసుుల గాలించారు. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్, మరో ముగ్గురిపై దీక్షిత్ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో నిందితునలు పోలీసుుల మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మత్తు 'ట్యాబెట్లు ఇచ్చి బాలుడిని చంపినట్లు తెలుస్తోంది. బాలుడి శవం మహబూబాబాదుకు 5 కిలోమీటర్ల దూరంలో పడి ఉంది.కిడ్నాప్ చేసిన రోజునే బాలుడిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితుుల ఇంటర్నెట్ కాల్స్ చేస్తూ పోలీసుల కళ్లు కప్పుతూ వచ్చారు.

దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆదివారంనాడు షాపింగ్ కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. తమ ఇంటి పక్కనే ఉన్న భువనచంద్ర, హర్షలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు.

బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరు దీక్షిత్ ను పిలిచారు. దాంతో అతను వారితో వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9.40 గంటలకు కిడ్నాపర్లు దీక్షిత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు సిద్ధం చేసి రోజంతా తల్లిదండ్రులు నిరీక్షించారు.