తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఆదివారం బిజిబిజీగా గడిపారు. బల్కంపేట్‌లో వైకుంఠదామాన్ని ప్రారంభించిన మంత్రి, అనంతరం సనత్‌నగర్‌లోని థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని, మారేడ్‌పల్లిలో జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌ హాల్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారని అదే విధంగా సనత్‌ నగర్‌ నియోజక వర్గాన్ని తలసాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, సనత్‌ నగర్‌లోని సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా సనత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని కేటీఆన్‌ను ఫోటో తీశారు. ఈ ఫోటోను నిన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్య బాల్కసుమన్‌ తన ట్విటర్‌ పోస్టు చేశారు.

పిక్‌ ఆఫ్‌ ద డే అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. కాగా ఈ ఫోటో నేడు కేటీఆర్‌ దృష్టిలో పడింది. ఆ బాలుడు ఫొటో తీస్తుండగా మరొకరు తీసిన అతడి ఫొటోను కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

‘ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి తన పని కానిచ్చాడు’ అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు.