ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024
ఉమ్మడి రాష్ట్రంలో కానీ , ప్రస్తుత తెలంగాణలో కానీ కమ్యూనిస్టులకు అడ్డా ఖమ్మం. ఈ లోక్‌సభ నియోజకవర్గం హేమాహేమీలను పార్లమెంట్‌కు పంపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రులనే ఎగువసభకు పంపిన చరిత్ర ఖమ్మం సొంతం. అర్ధం కానీ, విలక్షణ తీర్పులతో ఖమ్మం ప్రజలు తమ ప్రత్యేకత చాటుకుంటూ వుంటారు. ఇక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంపీలుగా విజయం సాధించడం విశేషం. కమ్మ, రెడ్డి, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఖమ్మంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, లెఫ్ట్ పార్టీలు మూడు సార్లు, బీఆర్ఎస్, వైసీపీ , టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఖమ్మం, పాలేరు, మధిర , వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలున్నాయి.
రాజకీయ చైతన్యానికి, పోరాటాలకు, ఉద్యమాలకు ఖిల్లా.. ఖమ్మం. రాజకీయాలను మలుపు తిప్పిన ఘటనలకు, మావోయిస్టులకు కంచుకోట ఖమ్మం. ఉమ్మడి రాష్ట్రంలో కానీ , ప్రస్తుత తెలంగాణలో కానీ కమ్యూనిస్టులకు అడ్డా ఖమ్మం. ఈ లోక్‌సభ నియోజకవర్గం హేమాహేమీలను పార్లమెంట్‌కు పంపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రులనే ఎగువసభకు పంపిన చరిత్ర ఖమ్మం సొంతం. అర్ధం కానీ, విలక్షణ తీర్పులతో ఖమ్మం ప్రజలు తమ ప్రత్యేకత చాటుకుంటూ వుంటారు.
కేంద్రం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా.. తమ వాణిని వినిపించడంలో ఖమ్మం ఎప్పుడూ ముందుంటుంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్ రావులు ఖమ్మం నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఇక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంపీలుగా విజయం సాధించడం విశేషం. కమ్మ, రెడ్డి, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఖమ్మంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఖమ్మం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. దిగ్గజాలను పార్లమెంట్‌కు పంపిన గడ్డ :
ఖమ్మం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, లెఫ్ట్ పార్టీలు మూడు సార్లు, బీఆర్ఎస్, వైసీపీ , టీడీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఖమ్మం, పాలేరు, మధిర , వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,13,094 మంది. వీరిలో పురుషులు 7,39,600 మంది.. మహిళలు 77,3428 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 11,38,425 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 75.24 శాతం పోలింగ్ నమోదైంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, ఒక చోట దాని మిత్రపక్షం సీపీఐ విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు పోలయ్యాయి. మొత్తం గులాబీ పార్టీ 1,68,062 ఓట్ల మెజారిటీ సాధించింది.
ఖమ్మం లోక్‌సభ స్థానంలో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో వుంది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 2004లో రేణుకా చౌదరి ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా వుండటంతో సునాయాసంగా గెలుస్తామన్న ధీమా నేతల్లో వుంది.
ఖమ్మం టికెట్ కోసం మంత్రుల కుటుంబ సభ్యులు పోటీపడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ అలాగే ఖమ్మంకు చెందిన వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్.. సీనియర్ నేతలు జెట్టి కుసుమకుమార్, వి హనుమంతరావులు టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఎవరి స్థాయిలో వారు టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
ఖమ్మం ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. టికెట్ కోసం అన్ని పార్టీల్లోనూ పోటీ :
బీఆర్ఎస్ విషయానికి వస్తే .. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఆల్రెడీ టికెట్ ప్రకటించారు. ఆయన కూడా నిత్యం జనాల్లో వుంటున్నారు. కాంగ్రెస్‌కు ఈ సీటును దక్కకుండా చేయాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. రెండు సార్లు ఎంపీగా, ఒకసారి టీడీపీ లోక్‌సభా పక్షనేతగా, మరోసారి బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా పనిచేసిన అనుభవం నామా నాగేశ్వరరావు సొంతం. దీంతో మరోసారి ఆయనకే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు.
బీజేపీ కూడా ఖమ్మంను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మోడీ చరిష్మాతో పాటు సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేయాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్ రావులు అభ్యర్ధి రేసులో వున్నారు. కమ్యూనిస్టులు కూడా తమకు పట్టున్న ప్రాంతం కావడంతో కాంగ్రెస్ మద్ధతుతో ఖమ్మంలో పోటీ చేయాలని భావిస్తున్నారు.
- All India Majlis e Ittehadul Muslimeen
- anumula revanth reddy
- bharat rashtra samithi
- bharatiya janata party
- congress
- general elections 2024
- harish rao
- kalvakuntla chandrashekar rao
- kalvakuntla kavitha
- kalvakuntla taraka rama rao
- khammam Lok Sabha constituency
- khammam lok sabha elections result 2024
- khammam lok sabha elections result 2024 live updates
- khammam parliament constituency
- lok sabha elections 2024
- parliament elections 2024