ఎన్ఐఏ ఎస్పీగా ఖమ్మం సీపీ విష్ణు వారియర్.. ఆయన ప్రత్యేకతలివే...
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. అన్నిశాఖల్లోనూ ప్రక్షాళన జరుగుతుంది. చాలావరకు ఐపీఎస్లను బదిలీ చేసినప్పటికీ విష్ణు వారియర్ ను బదిలీ చేయలేదు.
ఖమ్మం : ఖమ్మం సిటీ పోలీస్ కమిషనర్ గా సేవలందిస్తున్న విష్ణు వారియర్ త్వరలోనే కేంద్ర సర్వీసులోకి వెళ్ళనున్నారు. డిప్యూటేషన్ పై ఐదేళ్లపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎస్పీగా పనిచేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ సీఎస్ కు లెటర్ అందింది. విష్ణు వారియర్ ను వెంటనే స్టేట్ సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలని ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇటీవల కేంద్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఆమ్రపాలి కాటా తెలంగాణ సర్వీసులో చేరిన సంగతి తెలిసిందే.
స్టేట్ సర్వీసులోకి చేరిన ఆమ్రపాలిని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. అన్నిశాఖల్లోనూ ప్రక్షాళన జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆమ్రపాలి కాట కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకు మారారు. చాలావరకు ఐపీఎస్లను బదిలీ చేసినప్పటికీ విష్ణు వారియర్ ను బదిలీ చేయలేదు. ఖమ్మం సీపీగా ఉన్న విష్ణు వారియర్ కు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
Nandi Awards: నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
ఆయనను సెంట్రల్ సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లుగా కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. విష్ణు వారియర్ 2013 తెలంగాణ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్. 2021 ఏప్రిల్ 6 నుంచి ఖమ్మంలో సిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు అదిలాబాదులో ఉన్నారు. కరోనా సమయంలో జిల్లాలో బాధ్యతలు చేపట్టిన విష్ణు వారియర్ సమర్థవంతంగా, ఎంతో సమన్వయంతో శాంతిభద్రతలను కాపాడారు. కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి ధైర్యం ఇచ్చారు.
ఇప్పుడు విష్ణువారియర్ ప్లేస్ లో వికారాబాద్ ఎస్పీ రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే విష్ణు వారియర్ డిప్యూటేషన్ మీద వెళ్తారా, లేదా? ఎన్ఐఏలో తన సేవలు అందిస్తారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.