Asianet News TeluguAsianet News Telugu

ఆదివారం ఉదయం 11లకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

 తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం ఆదివారం ఉదయం 11 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహణ కమిటీ స్పష్టం చేసింది. శనివారం అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ట్రాలీ వెల్డింగ్ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. 

khairatabad ganesh immersion sunday morning 11 am
Author
Hyderabad, First Published Sep 22, 2018, 9:07 PM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం ఆదివారం ఉదయం 11 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహణ కమిటీ స్పష్టం చేసింది. శనివారం అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ట్రాలీ వెల్డింగ్ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. 

వెల్డింగ్ పనులు పూర్తయ్యాక ఉదయం 4 గంటలకు ట్రాలీపైకి గణేషుణ్ణి ఎక్కిస్తారని ప్రకటించింది. ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఉదయం 9 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ గణేషుడు చేరుకుంటాడని కమిటీ స్పష్టం చేసింది. 11 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. 

అటు పోలీసులు సైతం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 11 గంటలకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని గణనాధుల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది పోలీస్ శాఖ.

Follow Us:
Download App:
  • android
  • ios