ఖైరతాబాద్‌‌ గణపతి ఈసారి ఇలా ఉంటాడు

First Published 18, Jun 2018, 11:07 AM IST
khairatabad ganesh as Saptha Mukha Kala Sarpa Maha Ganapathi
Highlights

ఖైరతాబాద్‌‌ గణపతి ఈసారి ఇలా ఉంటాడు

దేశంలో గణేశ్ నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే... అందులోనూ ఖైరతాబాద్ గణపయ్య ఇంకా ఫేమస్.. దశాబ్ధాలుగా భారీకాయంతో... విభిన్న రూపాలతో కొలువుదీరుతూ.. భక్తుల పూజలందుకుంటున్న పార్వతి తనయుడు ఈసారి ఎలా ఉండబోతున్నాడా అని భక్తకోటి ఆశగా ఎదురుచూస్తుంటారు. వారి అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆలయ కమిటీ ఖైరతాబాద్ గణపతిని తీర్చిదిద్దుతోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది ‘ శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ గా కొలువుదీరనున్నాడు.

ఈ భారీ కాయుడి ఎత్తు 57 అడుగులు, వెడలప్పు 24 అడుగులు.. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గతేడాది కూడా  57 అడుగులే ఉన్నప్పటికీ.. విగ్రహాన్ని తయారు చేస్తోన్న శిల్పి షష్టిపూర్తి సందర్భంగా విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు. ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’కి ఏడు తలలు, 14 చేతులు.. తలపై ఏడు సర్పాలు.. కింద ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఉంటాయి.. ఈయనకు కుడివైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు ఉంటాయి.

loader