తెలంగాణలో కేసీఆర్ మరోసారి  సీఎం అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ నాతో మాట్లాడలేదన్నారు. 


హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ నాతో మాట్లాడలేదన్నారు.

సోమవారం నాడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయిన తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు.సుమారు నాలుగు గంటల పాటు అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ తో భేటీ అయ్యారు.

నేను ఇవాళ మా పార్టీ తరపున అపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యాను. తెలంగాణ సీఎంగా కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఐఎం కేసీఆర్ వెంట నిలుస్తోందని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించనున్నారు. ప్రజలనాడి ఆధారంగా ఆయన మరోసారి సీఎంగా ప్రమాణం చేస్తారని ఆయన చెప్పారు.
ఎంఐఎం మద్దతు లేకుండానే కేసీఆర్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

రేపు మరోసారి కేసీఆర్ ను కలుస్తానని అసదుద్దీన్ చెప్పారు. బీజేపీ బలం ఏమిటో రేపు తేలనుందని అసద్ చెప్పారు. ప్రజలంతా కేసీఆర్ వెంటనే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌తో భేటీకి బుల్లెట్‌పై ఒంటరిగా ప్రగతి భవన్‌కు అసద్ (వీడియో)

కాబోయే సీఎంతో... : కేసీఆర్‌తో భేటీకి ముందు అసద్ ట్వీట్