హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం నాడు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ సూచన వినతి మేరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఆదివారం నాడు ఎంఐఎం చీఫ్  అసద్‌ కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమయంలో  సోమవారం నాడు  భేటీ కావాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందే  వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

టీఆర్ఎస్‌కు  పూర్తి మెజారిటీ రాకపోతే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఎంఐఎంతో కూడ చర్చిస్తున్నట్టు  సమాచారం.

టీఆర్ఎస్‌తోనే తాము ఉంటామని అసద్ ప్రకటించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ రిక్వెస్ట్ మేరకు సోమవారం నాడు ఎంఐఎం చీఫ్ బుల్లెట్‌పై  హెల్మెట్ ధరించి  ప్రగతి భవన్‌కు  చేరుకొన్నారు. గన్‌మెన్లు  లేకుండా ప్రగతి భవన్ కు చేరుకొన్నారు.

కేసీఆర్‌తో సమావేశానికి ముందు ట్విట్టర్ వేదికగా ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాబోయే సీఎంతో  తాను భేటీ కాబోతున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ స్వంతంగా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. 

వీడియో

 

సంబంధిత వార్తలు

కాబోయే సీఎంతో... : కేసీఆర్‌తో భేటీకి ముందు అసద్ ట్వీట్