తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నూతన సచివాలయంలో తొలి  సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సమీక్ష సమావేశం జరగనుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నూతన సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వ‌ల విస్త‌ర‌ణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు ప‌నుల‌పై కేసీఆర్ స‌మీక్షించ‌నున్నారు. కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ‌ల ప‌నుల‌పై కూడా కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ నూతన సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించిన సుముహుర్తానికి కుర్చీలో ఆసీనులైనారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆరు ద‌స్త్రాల‌పై సుముహుర్తంలోనే సంత‌కాలు చేశారు. ఫైల్స్‌పై సంతకం చేసిన అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియాజేశారు. 

కేసీఆర్ నూతన సచివాలయంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఆసీనులైన సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యానికి సంబంధించిన కాఫీ టేబుల్ పుస్త‌కంతో పాటు క‌విత నీరాజ‌నం పుస్త‌కాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో గీత యాదాద్రి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేశారు. ఇక, ఆ తర్వాత మంత్రులు కూడా నూతన సచివాలయంలో వారి వారి ఛాంబర్లలో ఆసీనులైయ్యారు.