ఈ ఏడాది చివర్లో కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొంటారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో KCR తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొంటారని రేవంత్ రెడ్డి చెప్పారు.టీపీసీసీ చీఫ్ Revanth Reddy సోమవారం నాడు Hydeerabad లో CLP కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కేసీఆర్ సర్కార్ కి చివరి బడ్జెట్ అని ఆయన చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ నుండి BJP ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. Congress కు బీజేపీకి సిద్దాంతపరంగా విబేధాలున్నాయన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో Speaker వ్యవహరించిన తీరు సరిగా లేనందున తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పదే పదే విన్నవించినా కూడా స్పీకర్ Pocharam Srinivas Reddy మల్లు భట్టి విక్రమార్క వైపు చూడలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహర శైలిని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహల ముందు ధర్నాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నందున స్పీకర్ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగానికి Governor కస్టోడియన్ గా ఉన్నందున ఈ ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. 

తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసేలా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్ధులను, తెలంగాణ అమరులను అవమానపర్చేలా తెలంగాణ బడ్జెట్ ఉందన్నారు. నిరుద్యోగులకు భృతి చెల్లించడానికి కనీసం ఒక్క రూపాయిని కూడా బడ్జెట్ లో పెట్టని విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.