ఉద్యోగాలు పోతాయ్: ఆర్టీసి సమ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం

KCR warns RTC workers on strike notice
Highlights

ఆర్టీసి సమ్మెపై ఉక్కుపాదం మోపడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్: ఆర్టీసి సమ్మెపై ఉక్కుపాదం మోపడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించుకున్నారు. ఆర్టీసి కార్మికులకు ఆయన హెచ్చరికలు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఆర్టీసి కార్మిక సంఘం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాలు పోతాయని ఆయన హెచ్చరించారు. సమ్మె నోటీసు ఇవ్వడమే బాధ్యతారాహిత్యమని అన్నారు. ఒకవేళ కార్మికులు సమ్మెకు వెళ్తే ఆర్టీసి చరిత్రలో ఇదే చివరి సమ్మె అవుతుందని ఆయన అన్నారు.

ఆర్టీసిని కాపాడడమే తమ ఉద్దేశమని, ఆర్టీసిలో సమ్మెను నిషేధించామని ఆయన చెప్పారు. యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసిలో 44 శాతం జచీతాలు పెంచామని చెప్పారు.

రెండేళ్లుగా ఆర్టీసిలో ఏ విధమైన మార్పు రాలేదని, రూ. 700 కోట్ల నష్టంతో నడుస్తున్న ఆర్టీసిలో సమ్మె ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు.

loader