రాష్ట్రమంతా పింక్ గా మిళమిళ లాడుతూ ఉంటే, అక్కడ మువ్వన్నెల కాంగ్రెస్ రెపరెపలాడటం బాగ లేదు
కాంగ్రెస్ ఖిల్లా నల్కొడ పాత జిల్లా ప్రాంతాన్ని వశపర్చుకనేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటినుంచే పథకంవేస్తున్నట్లు సమాచారం.
ఇపుడు కొత్త జిల్లాలు వచ్చినా, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులే పెత్తనం సన్నగిల్లే అవకాశాలు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ను తరిమేస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమయినట్లే లెక్క అని ఆయన భావిస్తున్నారట.
నిజమే, 2014లో టిఆర్ ఎస్ పింకు సునామీని తట్టుకుని బలంగా నిలబడిన జిల్లా నల్గొండ ఒక్కటే. ఇపుడు అసెంబ్లీలో గట్టిగా మాట్టాడుతున్నవారు, కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న వాళ్లు నల్లొండ జిల్లా నాయకులే. పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లానుంచే గెలుపొందారు. అలాగే ఆయన భార్య పద్మావతి కూడా అక్కడి నుంచే అసెంబ్లీ కొచ్చారు. ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి నల్గొండ జిల్లా నుంచి గెలుపొందిన వాడే. అలాగే మరొక బలమయిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ జిలా ఎమ్మెల్యేయే. ఇపుడు ‘జిల్లా అభివృద్ధి’ కోసం కెసిఆర్ నాయకత్వంలోకి మారిన గుత్తా సుఖేందర్ రెడ్డ్డి కూడా నల్గొండ నుంచి లోక్ సభకు ఎన్నికయిన కాంగ్రెస్ ఎంపియే.
రాష్ట్రమంతా పింక్ గా మిళమిళ లాడుతూ ఉంటే, ఈ ఒక్క జిల్లాలో మువ్వన్నెల కాంగ్రెస్ రెపరెపలాడుతూ ఉంది.
ఎన్నికల్లో నల్గొండ జిల్లానుంచి ఎన్నికల్లో తలపడితే ఎలా ఉంటుందని ఆయన సన్నిహతులతో అన్నారని వార్తలు వెలువడుతున్నాయి.
‘‘నేను వచ్చేసారి కూడా రెండు చోట్ల పోటీ చేస్తాను. అందులో ఒకటి నల్లగొండ జిల్లా నుంచి ఎంచుకుంటే ఎలా ఉంటుంది.. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తారా..’’అని ఆయన ఒక సన్నిహితుడితో అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
ఈ మధ్య సభలో కాంగ్రెసో ళ్లు, రోడ్ల మీద కమ్యూనిస్టోళ్లు ఎక్కువ గోలచేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణా ఏర్పాటు తర్వాత మొదలయిన ‘బంగారు తెలంగాణా’ నిర్మాణం సజావుగా సాగాలంటే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉండాలి.
అందువల్ల ఈ కమ్యూనిస్టుల, కాంగ్రెసోళ్ల కంచుకోటలన్నింటినిఆయన 2019లో బద్ధలు కొడితే తప్ప రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడదని ఆయన భావిస్తున్నట్లున్నారు. ప్రతిపక్షం,వామపక్షం ఇపుడు బలంగా ఉన్నప్రాంతం నల్గొండ జిల్లాయే. చీటికి మాటికి కాంగ్రెసోళ్లు ప్రాజక్టుల మీద కేసులేస్తూ ఉండటం కూడా ఆయనకు చికాకు కల్గిస్తూ ఉంది.
అయితే ఈ విషయం మీద ఆరాతీస్తే, మరొక ఆసక్తి కరమయినవిషయం వెల్లడయింది.
నల్గొండ జిల్లాతో పాటు ఆయన టార్టెట్ లలో పాత మహబూబ్ నగర్ జిల్లా కూడా ఉందని ఈ జిల్లాకు చెందిన టిఆర్ ఎస్ నేత ఒకరు చెప్పారు.
రాష్ట్రంలో 2014లో తల ఎగరేసిన కాంగ్రెస్ నియోజకవర్గాలన్నింటిమీద ఆయన ప్రత్యేక దృష్టి పెడతారని, వీటన్నంటిని పింకుమయం చేయడం లక్ష్యంగా 2019 వ్యూహం ఉంటుందని ఆయన చెప్పారు.
ఏమయినా సరే, కెసిఆర్ నిర్ణయం కాంగ్రెస్ నాయకులలో దడ పుట్టించే విషయమే...
