ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. గవర్నర్ తమిలిసైతో భేటీ అయి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై  చర్చించనున్నారు. 

కమ్యూనిటీ స్ప్రెడ్ నేపథ్యంలో కోవిడ్ 19 వైరస్ మహామ్మారి వ్యాప్తి, కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చిజ జరగనున్నట్టు తెలియవస్తుంది. 

ఈ కరోనా కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా తమిళిసై బాగా ఆక్టివ్ గా కనబడుతున్నారు. ఆసుపత్రుల సందర్శన దగ్గరి నుండి ప్రైవేట్ ఆసుపత్రులతో మీటింగ్ నిర్వహించడం, కేంద్రంతో మాట్లాడి టెస్టింగ్ సామర్థ్యాన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో పెంచడం ఇతరాత్రాలలో తమిళిసై ఆక్టివ్ గా ఉంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడ్డప్పటికీ... ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక, మొన్నటి రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ అంశం చర్చించడానికి వెళుతున్నట్టుగా తెలియవస్తుంది. 

ఇకపోతే.....తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు.

వీరితో తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 557 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 111, వరంగల్ అర్బన్‌లో 117‌ మందికి పాజిటివ్‌గా తేలింది.