హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతం కోకాపేటలో బీఆర్ఎస్ నిర్మించ తలపెట్టిన ‘‘భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌’’ భవనానికి సీఎం కేసీఆర్ ఈరోజు భూమిపూజ చేశారు. 

హైదరాబాద్‌: నగర శివారు ప్రాంతం కోకాపేటలో బీఆర్ఎస్ నిర్మించ తలపెట్టిన ‘‘భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌’’ భవనానికి సీఎం కేసీఆర్ ఈరోజు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక, కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లకు చెందిన 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్​కు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కేటాయించిన సంగతి తెలిసిందే.


రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా దీనిని రూపొందించనున్నారు. మొత్తం 15 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.