కరీంనగర్:  గోదావరి నదిలో  తెలంగాణ సీఎం కేసీఆర్  నాణెలను  వదిలారు. నదుల్లో నాణెలను వదలడం సంప్రదాయం.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను  తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు. రాంపూర్ వద్ద పంపుహౌజ్ పనులను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని  ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఇదే సమయంలో  ప్రాజెక్టుకు సమీపంలో గోదావరి నది నీరు ప్రవహిస్తున్న ప్రాంతానికి కేసీఆర్ చేరుకొన్నారు. నీళ్లలో నడుచుకొంటూ కొంత దూరం వెళ్లారు.నది నీటిలో నాణెలను వదిలారు.

తన వెంట ఉన్న అధికారులతో పాటు ఇతరులకు కేసీఆర్ నాణెలను పంచారు. అందరూ గోదావరి నది నీటిలో నాణెలను వదిలిపెట్టారు. గోదావరి నదీ జలాలకు వారంతా నమస్కరించారు. అనంతరం కేసీఆర్ అక్కడి నుండి నేరుగా మేడిగడ్డకు చేరుకొని  ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు.