కేసిఆర్ షాక్: డేంజర్ జోన్ లో 39 ఎమ్మెల్యేలు

KCR Survey: 39 MLAs are in danger zone
Highlights

తమ శాసనసభ్యులంతా బాగా పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆ మధ్య ఓసారి అన్నారు.

హైదరాబాద్: తమ శాసనసభ్యులంతా బాగా పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆ మధ్య ఓసారి అన్నారు. కానీ పరిస్థితి అంత సజావుగా లేదని అర్థమవుతోంది. ఆయన చేయించిన సర్వేలో దాదాపు 39 మంది ఎమ్మెల్యే పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. 

వారిలో కొంత మందితో కేసిఆర్ స్వయంగా మాట్లాడారని, మరికొంత మందితో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారని సమాచారం. ఆ 39 మంది ఎమ్మెల్యేలకు కేసిఆర్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతా బాగుందని భావిస్తున్న తరుణంలో సర్వే ఫలితాలు చూసి కేసిఆర్ షాక్ తిన్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే వారిని ఎవరూ కాపాడలేరని కూడా కేసిఆర్ అన్నట్లు తెలుస్తోంది. వందకు తగ్గకుండా వచ్చే ఎన్నికల్లో శాససనభ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. 

తమకు ఎదురు లేదని ఇంత కాలం భావిస్తూ వచ్చిన కేసీఆర్ ను సర్వే ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెబుతున్నారు. మిషన్ కాకతీయ, మిషన భగీరథ, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల వల్ల ప్రజలు ఏకపక్షంగా తమ వైపు ఉంటారని కేసిఆర్ భావిస్తూ వస్తున్నారు. 

ప్రస్తుతం ఇతర పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే టీఆర్ఎస్ కు 90 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో 39 మంది సభ్యుల పనితీరు బాగాలేదంటే సగానికి సగం మంది సిట్టింగులకు టికెట్లు నిరాకరించాల్సి ఉంటుంది. అదే జరిగితే, మరింత గందరగోళానికి దారి తీయవచ్చునని అంటున్నారు .

loader