ఈటల పొట్టిగా, నేను సన్నగా ఉన్నాం : కేసిఆర్ చమత్కారం

KCR speech full text at Rythu Bandhu scheme launching programme
Highlights

రైతు బంధు సభలో కేసిఆర్ ఏమన్నారంటే ?

జహీరాబాద్ లో జరిగిన రైతుబంధు పథకం ప్రారంభోత్సవంలో సిఎం కేసిఆర్ మాట్లాడారు. ఆయన స్పీచ్ ఫుల్ టెక్ట్స్ కింద ఉంది చదవండి.

స్థానిక ఎమ్మెల్యే,మంత్రి ఈటల నాకు తమ్ముని లాంటివాడు. ఈరోజు బుక్కులు, చెక్కులు అందించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా నాకు ఎంతో ప్రత్యేకం.. జిల్లా నుండి ఎ పని మొదలు పెట్టినా 100 శాతం విజయం సాధిస్తాం. ఉద్యమ కాలం నుండి  కూడా తెలంగాణ బావుటాను ఎగుర వేసిన జిల్లా ఈ జిల్లానే. జిల్లా ఖ్యాతిని పెంచింది మొన్న సివిల్ లో జగిత్యాల లో మొదటి ర్యాంక్ వచ్చింది. మీకు పరిపాలించే మొఖం లేదు, అని ఆనాడు అన్నారు.. కానీ 24 గంటల కరెంట్ సాధించుకున్నాం. కులాలు, మతాలు లేకుండా నాణ్యమైన  రెసిడెన్షియల్ విద్యను అందించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 28 శాతం అత్యధికంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక రాజకీయ నాయకుల లాగా అధికారులు కూడా అభివృద్ధిలో తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తూన్నారు. భూ ప్రక్షాళన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 6000 వేల కోట్లు నిన్ననే బ్యాంకులలో డిపాజిట్ చేసినం.

2014 ముందు కరెంట్ ఉంటే వార్త. ఇపుడు కరెంట్ పోతే వార్త. ధర్మరాజు పల్లెలో విత్తన భాండా కర్మాగారం పెట్టి విత్తనాలను రైతులకు నేరుగా సరఫరా చేస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో నరేగా అనే దానిని రైతులకు అనుసంధానం చేసి, రైతులకు మద్దతు ధర ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి తెలియ చేద్దాం. 1/4 ద్వారా మక్కలకు, వడ్లకు ఎంఎస్పీ ద్వారా మద్దతు ధర రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్న. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లు మిడ్ మానేరు లో నీళ్లు పోస్తే సంవస్తారానికి రెండు పంటలు పండించుకోవచ్చు. తెలంగాణ కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల నీళ్లు వచ్చేలా CWC ఆమోదం పొందాం. 28,38 ఏళ్ళు ఆంద్ర పాలకులు పాలించిన కూడా జరగని అభివృద్ధి ఈనాడు తెలంగాణ వచ్చినంక సాధించుకున్నాం. నేను, ఈటల పొట్టిగా సన్నగా ఉన్నాం.. మీరు పొడుగు 70,80,కిలోలు ఉన్నారు మీరు చెయ్యలేని పని చేస్తున్నాం. మంత్రి ఈటల కోరిక మేరకు కరీంనగర్ జిల్లా అభివృద్ధి కొరకు 500 కోట్లు ఇస్తున్నా. జూన్ 2 తర్వాత  రిజిస్ట్రేషన్ విధానంలో కూడా మార్పు తీసుక వస్తున్నాం. ఎమ్మార్వోలకు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను అప్పగిస్తున్నాం..4 రోజులలోపు పాస్ బుక్ లు మన ఇంటికే వస్తాయి. జూన్ 2 తర్వాత బ్యాంకుల కు పంట రుణాలు ఇవ్వడానికి ఎలాంటి పాస్ బుక్కులు బ్యాంక్ లో ఇవ్వకుండా రుణాలు ఇస్తాం. కౌలు రైతులకి రైతు బంధు పథకం వర్తించదు.. పాస్ పుస్తకాలలో పట్టాదారు పేరు మాత్రమే ఉంటది.. అనుభవదారుని పేరు ఉండదు.. రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2 కోట్ల 38 లక్షల భూమి రికార్డులను అధికారులు పరిశీలించారు.

వ్యవసాయ రంగంలో టీఆరెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి. పోరాడి,కోట్లాడి  తెచుకున్నాక తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే వరకు నేను నిద్రపోను. అగ్ర కులాలు అని పేరు ఉన్న పేదలకు తగిన స్కీములు కూడా అది త్వరలోనే ప్రకటిస్తూ, వారికి మా అండదండలు ఉంటాయి. జూన్ 2 నుండి రాష్ట్రంలో రైతు ఎలాంటి ఇబ్బంది పడి  చనిపోయిన రైతుకి 5 లక్షల భీమా ఇస్తున్నాం. ఈ సంవత్సరం మైనారిటీలకు 4000కోట్లు మొన్న బడ్జెట్లో ప్రవేశ పెట్టాం. మిషన్ భగీరథ ద్వారా రాబోయే 10,15 రోజుల్లో ఇంటింటికి త్రాగునీరు అందించబోతున్నాం. 58 లక్షల రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు నేటి నుండి ఇవ్వబోతున్నాం. వ్వ్యవసాయం దండగ కాదు, పండగ అని రాబోయే రోజుల్లో అని చేసి చూపిస్తాం. 60 ఏళ్ళు కాంగ్రేస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. టీఆరెస్ తెలంగాణ సాధించిన పార్టీ, కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ. న్యాయం, ధర్మం వైపు మీరు ఉంటారు కాబట్టి మీ ఆశీర్వాదా బలంతో ఇంకా ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించుకుందాం.

loader