గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ బుధవారం నాడు టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చోటు చేసుకొన్న ఘటనలతో పాఠాలు నేర్చుకోకుండా అదే పద్దతిలో కొనసాగడం సరైందా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: Governors వ్యవస్థపై తెలంగాణ సీఎం KCR టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఘటనలతో పాఠాలు నేర్చుకోకుండా పాత పద్దతిలోనే వ్యవహరించడం సరైందేనా అని కేసీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారా, రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగింది. ఈ తరుణంలో తమిళిసైకి, మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తమిళిసై పేరేత్తకుండానే కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థపై మండిపడ్డారు.
బుధవారం నాడు హైద్రాబాద్ హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన TRS Plemay లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
మహారాష్ట్ర గవర్నర్ కు మహారాష్ట్ర కేబినెట్ 12 ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే ఏడాది వరకు ఫైల్ గవర్నర్ వద్దనే పెట్టుకొన్నాడని సీఎం చెప్పారు. తమిళనాడులో శాసనసభ బిల్లు పాసి చేసి పంపితే తమిళనాడు గవర్నర్ పెడ ధోరణితో వ్యవహరిస్తున్నాడన్నారు. బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలలో గవర్నర్లకు సీఎం ల మధ్య పంచాయితీ నడుస్తుందన్నారు.
పేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో NTR పార్టీని ఏర్పాటు చేశారన్నారు. తన లాంటి వాళ్లు 200 మంది ఎమ్మెల్యేలు ఆనాడు విజయం సాధించి TDP అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్తను ఉపయోగించుకొని ఎన్టీఆర్ ను పదవీ నుండి తప్పించారని కేసీఆర్ ప్రస్తావించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమంతా చూశామన్నారు. ఎన్టీఆర్ ను మళ్లీ సీఎంగా చేసే వరకు తెలుగు ప్రలు పోరాటం చేసిన విషయాన్ని కేసీఆర్ మననం చేసుకొన్నారు.ఎన్టీఆర్ తో దుర్మార్గంగా వ్యవహరించిన గవర్నర్ ఇక్కడి నుండి వెళ్లిపోయాడన్నారు. ఇలాంటి ఘటనల గురించి దేశం పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి అదే పద్దతిలో వ్యవహరిస్తామంటే ఎలా అని కేసీఆర్ మండిపడ్డారు.
ప్రజల కోసం, ప్రజలకు లోబడి రాజ్యాంగ సంస్థలు పనిచేయాలన్నారు. కానీ దేశంలో ప్రస్తుతం దానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు
