Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు బాగానే మాట్లాడారు.. మరి 5జీ స్పెక్ట్రం వేలం‌ వెనక మతలబు ఏమిటి?: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని బీజేపీ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించారు.

KCR Sensational comments on 5G Spectrum auction
Author
First Published Aug 6, 2022, 6:00 PM IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని బీజేపీ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించారు. రేపు ఇవే మిమ్మల్ని కబళిస్తాయని అన్నారు. దేశంలో ఏకస్వామయ్య పార్టీ విధానం వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంటున్నారని.. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా అని ప్రశ్నించారు. ఇదేనా టీమిండియా స్పూర్తి?, కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం? అని ప్రశ్నించారు. 

బెంగాల్‌లో, తెలంగాణలో.. ఏక్‌నాథ్ షిండేలు వస్తారని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాగా ఉందా అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానామా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారని విమర్శించారు. పాలు, పెరుగు మీద పన్నులు వేస్తున్నారని.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారని విమర్శించారు. గార్బా అనే సంపద్రాయ నృత్యం మీద కూడా పన్ను వేశారని మండిపడ్డారు. 

Also Read: కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు.. డయాలసిస్ పేషెంట్లకు కూడా: స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ కేసీఆర్ కానుకలు

‘‘ఉచితాలు బంద్ చేయాలని ఇప్పుడు కొత్త నినాదం ఎత్తుకున్నారు. వృద్దులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా?, రైతులు బాధలో ఉంటే.. రైతు బంధు ఇవ్వడం తప్పా?,  ఉచితాలు తప్పు అయితే ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు. కొన్ని సంస్థలకు ఎన్‌పీఏల పేరిట రూ. 12 లక్షల కోట్లు ఇచ్చారు. రూ. 2 లక్షల కోట్ల ఎన్‌పీఏలు.. రూ. 20 లక్షల కోట్లకు ఎందుకు పెరిగింది?. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు. 

దేశంలో 83 కోట్ల ఎకరాలు భూభాగం ఉంది.. ఇందులో 50 శాతం వ్యవసాయ అనుకూల భూమి ఉంది. ప్రతి ఎకరాకు కూడా నీరిచ్చే నది సంపద ఉంది. రత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగారు. ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఇచ్చే ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు?. విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి. మనదేశంలో కూడా శ్రీలంక  వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని కేసీఆర్ కామెంట్ చేశారు. 

‘‘నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్తే.. నాలుగు నిమిషాలు మాట్లాడి, నాలుగు గంటలు కూర్చుంటాం. అక్కడికి వెళ్లి మనం మాట్లాడితే వాళ్లపై ప్రభావం పడదు. ఇలా మీటింగ్ బహిష్కరించి నిరసన తెలుపడం ద్వారా వాళ్లకు మా ఆవేదన వ్యక్తం అవుతుందనే ఇలా చేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి మీటింగ్ బహిష్కరించడంపై దేశం అంతా చర్చిస్తుంది. అప్పుడైనా ప్రధానికి ఈ విషయం అర్థం అవుతుంది’’ అని కేసీఆర్ చెప్పారు. 

Also Read: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేసీఆర్ కీలక ప్రకటన

ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలను తొలగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్‌పై బీజేపీ  ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. ఇప్పుడు 5జీ స్పెక్ట్రమ్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. 5జీ స్పెక్ట్రం వేలంలో రూ.  5లక్షల కోట్లు రావాల్సి ఉంది.. కానీ రూ. లక్షన్నర కోట్లే ఎలా వస్తాయని ప్రశ్నించారు. దీని వెనక మతలబు, కుంభకోణం ఏమిటని ప్రశ్నించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios