Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుంచే రైతు బంధు చెక్కుల పంపిణీ: సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్  రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. 
 

kcr says rythu bandhu cheques be distributed 5th october
Author
Nalgonda, First Published Oct 4, 2018, 8:40 PM IST

నల్గొండ: రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్  రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. 

రైతు బంధు చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నిందని కేసీఆర్ ఆరోపించారు. చెక్కులు పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు పోతే చెంపలు వాయించి పంపిందన్నారు. రైతుల పొట్ట కొట్టొద్దని  మొట్టి చెంపలు వేసిందని కేసీఆర్ తెలిపారు. రేపటి నుంచే చెక్కుల పంపిణీ చేపడతామన్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు చెక్కులు సిద్ధం చెయ్యాలని ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. 

దాదాపు 50 లక్షల మంది రైతులకు రైతు బంధు చెక్కులను అందజేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు రూ.4వేలు చొప్పున 6కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios