Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను కేసిఆర్ అవినీతిలో నెంబర్ 1 చేశారు : బిజెపి రావు పద్మ

మోడీ పై ప్రశంసలు

KCR regime is number one in corruption: BJP

తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిలోనే నెంబర్ స్థానంలో నిలిపారని సిఎం కేసిఆర్ మీద ఫైర్ అయ్యారు వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ. వరంగల్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఫైర్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నీతి, నిజాయితీగా సాగుతుంటే తెలంగాణలో కేసిఆర్ పాలన అవినీతిమయమైపోయిందన్నారు.

నవభారత నిర్మాణమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజెపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. గత 4 సంవత్సరాల పాలనలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని ఆమె తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 4 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా గురువారం బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతృత్వంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛ్భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుండే హన్మకొండ లోని అదాలత్ వద్ద గల అమరవీరుల స్తూపం, బమ్మెర పోతన విగ్రహం, నక్కలగుట్టలోని శ్రీ కాళోజి నారాయణ గారి విగ్రహం, డాక్టర్ బిఆర్. అంబెడ్కర్ గారి విగ్రహం, హన్మకొండ చౌరస్తా లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ములుగు క్రాస్ రోడ్ వద్ద గల మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహం, వరంగల్ పోచమ్మమైదాన్ వద్ద గల రాణి రుద్రమ్మ విగ్రహం, వెంకట్రామ జంక్షన్ వద్ద గల ఉక్కుమనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని, స్టేషన్ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం, మరియు పాపయ్యపెట్ చమన్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహాలను శుభ్రం చేసారు.

KCR regime is number one in corruption: BJP

ఈ సందర్బంగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండ దిగ్విజయంగా 4 వసంతాలు పూర్తి చేసుకొని నవభారత నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ బడుగుబలహీనవర్గాలు, రైతులు, కార్మికులు పెద ప్రజల అభివృధే లక్ష్యంగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నదని, ఈరోజు అభివృద్ధిలో భారత దేశాన్ని ప్రపంచ పటంలో ముందు నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కెసిఆర్ అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నీళ్ళబెట్టారని విమర్శించారు. అదే విధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రధాన రహదారిలోని మహనీయుల విగ్రహాలను గోడ పత్రికలను అతికించి అద్వానంగా తయారు చేసారని, వాటిని ఈరోజు స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేశామని కనీసం ఇకనైనా పాలకపక్షం మరియు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ అధికారులు వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిదుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios