ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న పథకాలను  తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించారు. గోల్కోండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

KCR promises  PRC Revision For Government Employees lns

 హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకన్నా ఎంతో ముందుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని గోల్కోండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం  ఆయన  ప్రసంగించారు.

 నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతుంది  తెలంగాణ ఉద్యోగులేనని సంతోషిస్తున్నట్టుగా  ఆయన తెలిపారు. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికే రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. 

చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేశామన్నారు.  త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే అప్పటివరకు  మధ్యంతర భృతిని చెల్లిస్తామని  శాసనసభా సమావేశాల్లో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

  గత ప్రభుత్వాలు నష్టాలపాలు చేసిన సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దిందన్నారు. సింగరేణి టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెంచినట్టుగా చెప్పారు. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నట్టుగా  సీఎం కేసీఆర్ వివరించారు.

 వీ.ఆర్.ఏ.లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది తెలంగాణ ప్రభుత్వమేన్నారు. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేలు అమలు చేసినట్టుగా  చెప్పారు. విద్యార్హతలు, సామర్ధ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరుచేసిందని సీఎం వివరించారు.

గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 
విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రూ. 67 వేల 149 కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తుందని సీఎం చెప్పారు.  

ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధిని  చేపట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వీటిలో చాలాభాగం  ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసినట్టుగా చెప్పారు.   ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్ ను అనుసంధానం చేస్తూ మెట్రో రైలును విస్తరిస్తున్నట్టుగా  ఆయన వివరించారు.ఇటీవల  రాష్ట్రపతి చేతుల మీదుగా 13 జాతీయ అవార్డులను మన స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం రాష్ట్రానికి  గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు.

గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో నేడు వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.    భావి భారత పౌరులు బలంగా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లలోనూ, మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని పాఠశాలలలోనూ విద్యార్థినీ  విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతుందన్నారు. 

also read:ఆర్టీసీ బిల్లును అడ్డుకొనేందుకు విఫల యత్నం: ఇండిపెండెన్స్ వేడుకల్లో కేసీఆర్

 డబ్బులేని కారణంగా పేద విద్యార్థులెవరూ ఉన్నత విద్యకు దూరం కావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. నేడు వేలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వివిధ దేశాలలో ఉన్నతమైన  చదువులు చదువుతున్నారన్నారు.ప్రజలకు పాలనను మరింత  చేరువ చేసేందుకుకొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టుగా ఆయన  గుర్తు చేశారు.అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించినట్టుగా ఆయన  గుర్తు చేశారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios